ఉండవల్లి – టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.కేసులో అక్రమంగా ఇరికించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కుటుంబసభ్యులు చంద్రబాబును ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ఆయన ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఫొటోలను తెదేపా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది