ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టింది. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు ఉండబోవని.. ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతా మీ ఇష్టమున్నట్టు చేస్తామంటే కుదరని ఈసీ సీరియస్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం రూల్స్‌కి విరుద్ధమని తెలిపింది.
ఈ మేరకు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదన్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు పంపింది. ఇట్లా చేయడం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని పేర్కొంది ఈసీ. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.
- Advertisement -