హైదరాబాద్ – తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం కోరుకుంటున్నట్టు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయా రాష్ట్రాలతో అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. దీనికి స్పందించిన రేవంత్‌రెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం, సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Thanks Twit – మేమూ అదే కోరుకుంటున్నాం – జగన్ కు రేవంత్ రెడ్డి ట్విట్
Advertisement
తాజా వార్తలు
Advertisement