వెలగపూడి – ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.ఇందుకు పవన్‌కల్యాణ్.. ప్రధాని మోడీకి.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కోసం రూ.11, 440 కోట్లు కేంద్రం కేటాయించడంతో వేల కుటుంబాల ఆశలు చిగురించేలా చేసిందన్నారు. ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
ఇది ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని.. 1966 నాటి త్యాగాలకు ఇచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. 1966లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను అర్పించిన అమృతరావుతో సహా లెక్కలేనన్ని మంది ఇతరుల త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోతుందని తెలిపారు.
వారి రక్తం మరియు కన్నీళ్లు నేడు ఒక ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల గర్వం మరియు గుర్తింపుగా నిలిచిన దానికి పునాది వేశాయని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.