టిక్కెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
చంద్రబాబు, పవన్ లకు థ్యాంక్స్ చెప్పిన యంగ్ టైగర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దేవర. జాన్వీకపూర్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దేవర’ స్పెషల్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘దేవర’ మూవీ విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే టికెట్ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్ రూ.110, లోవర్ క్లాస్ రూ.60, మల్టీప్లెక్స్ రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం
కల్పించింది.
మరోవైపు తెలంగాణలోనూ స్పెషల్ షోలు, టికెట్ ధరలకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తొలిరోజు అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రూ.50, మల్టీప్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాలసి ఉంది..
చంద్రబాబు, పవన్ లకు థ్యాంక్స్ …
ఇలా అనుమతి ఇవ్వడంపై క థానాయకుడు ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్విట్ చేశారు. “ గౌరవనీయులైన సీఎం చంద్రబాబునాయుడు గారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు. ‘దేవర’ మూవీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు, స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు సినిమాకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్రికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అంటూ పోస్ట్ పెట్టారు.