Friday, November 22, 2024

తాడిగ‌డ‌ప‌లో వైభవంగా పుష్పయాగం

తాడిగ‌డ‌ప‌లో వైభవంగా పుష్పయాగం

  • గ్రామ వీధుల్లో ఊరేగింపు…
  • 108 బుట్టలు, 18 రకాల పూలతో స్వామికి పూజలు
  • తిరుమల త‌ర‌హాలో పూలతో విశేష పూజలు
  • గోవింద నామస్మరణ తో పులకించిన తాడిగడప

విజ‌య‌వాడ : వివిధ రకాల పూలు, 108 బట్టలతో శ్రీవెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే పుష్పయాగం త‌ర‌హాలోనే పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర గార్డెన్స్ లో ఉన్న శ్రీనివాస క్షేత్రంలోని వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అత్యంత వైభవంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమం, 6 గంటలకు ప్రాతఃకాల పూజలు నిర్వహించిన వేదపండితులు అనంతరం ఉదయం 7 గంటలకు విశ్వక్సేన పూజలను నిర్వహించారు. గ్రామ పొలిమేరల నుండి ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి పుష్పయాగం లో వినియోగించే 18 రకాల పూలను, 108 బుట్టలో ఉంచి గ్రామోత్సవం వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య నిర్వహించారు.
అంతకుముందు గ్రామ వీధులను పసుపు నీటితో శుభ్రం చేసి ఆలయం వరకు ఊరేగింపుగా పూలను తీసుకువచ్చారు. ఊరేగింపులో గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తుల తో పాటు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆలయంలో స్వామివారికి సుదర్శన యాగం తో పాటు, మహా మంత్రపుష్పం యాగాన్ని కన్నులపండువగా నిర్వహించారు. శ్రీనివాస క్షేత్ర ప్రధాన అర్చకుడు అగ్నిహోత్రం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రుత్వికులు స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు కోలాటం వంటి కళలను ప్ర‌ద‌ర్శించారు. స్వామి వారి పూజలను చూసిదుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులతో పాటు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ బోడె ప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
మహా అన్నసంతర్పణ
శ్రీనివాస క్షేత్రములో వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం నిర్వహించిన అనంతరం మహా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు దేవేంద్రనాథ్, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు, పి ఎస్ ఆర్ లు విస్తృత ఏర్పాట్లు చేశారు ఆదివారం తాడిగడప లో నిర్వహించిన ఈ విశేష కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement