మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా.. అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకోవడమే కాకుండా.. ‘తెలంగాణ వారికి మీకు ఇక్కడేం పని?’ అంటూ వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ మిగులు జలాలను దొంగిలిస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపించగా.. తెలంగాణ ప్రభుత్వమే అక్రమంగా జల విద్యుత్ కోసం నీటిని మళ్లిస్తోందని ఏపీ ఆరోపించింది. ఈ ఆరోపణ మధ్య ఇరు రాష్ట్రాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీగా బలగాలను మొహరించాయి.
- Advertisement -