Tuesday, November 19, 2024

కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదు: టిజి వెంకటేష్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచటన కామెంట్స్ చేశారు టిజి వెంకటేష్. కేసీఆర్ కు కరోనా కారణంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యిందని…అందుకే నీటి పంపకాల ఒప్పందాలు మర్చిపోతున్నారు అని టిజి వెంకటేష్ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసీఆర్ కాదంటున్నారు. తెలంగాణ నేతలు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు అయితే సాగునీరుగా, తాగునీటినీరుగా ఎలా వాడుకున్నారు అని ప్రశ్నించారు. కొత్త ఒప్పందాలు రద్దయితే పాత ఒప్పందాలు పాటించాలి…నిజాం వచ్చి తన ఒప్పందం రద్దు అంటే కేసీఆర్ ఒప్పుకుంటారా అని అడిగారు.

కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం రద్దు చేసి సమైఖ్యాఆంధ్ర అంటే కేసిఆర్ ఒప్పుకుంటారని.. ఆయన పెద్ద మేధావి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద్రాబాద్ లో ఎన్నికలు వస్తే ఆంధ్ర పాట పాడ్తారని… కరీంనగర్ లో ఎన్నికలు వస్తే తెలంగాణ పాట పాడతారని చురకలు అంటించారు. జల వివాదం సివిల్ వార్ కు దారి తీస్తుంది.. కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసిఆర్ కాదంటున్నారని…తెలంగాణ నేతలు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అంటున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: గద్వాల జిల్లాలో పిల్లి చేసిన నిర్వాకం

Advertisement

తాజా వార్తలు

Advertisement