Saturday, November 23, 2024

ఆర్చరీ పోటీలను ప్రారంభించిన టీజీ వెంకటేష్

చిన్నతనం నుంచే స్పోర్ట్స్ ను అలవర్చుకుంటే పిల్లలలో క్రమశిక్షణ, ఏకాగ్రత ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో రాష్ట్ర 41వ అంతర్ జిల్లా ఆర్చరీ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విలువిద్యలో లక్ష సాధన ఛేదించేందుకు ఏకాగ్రత ఎంతో అవసరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఆర్చరీ గేమ్ అభివృద్ధికి చెరుకూరి సత్యనారాయణ ఒక పితామహుడు లాగా ఉన్నారని ఆయన చెప్పారు. విలువిద్య నేర్చుకోడానికి వచ్చిన విద్యార్థులే తన సొంత పిల్లలుగా భావిస్తూ, ఆయన తన జీవితాన్నంతా ఈ గేమ్ అభివృద్ధికి తోడ్పడుతున్నారని టీజీ కొనియాడారు. ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారని, అందుకు తాను ఢిల్లీ స్థాయిలో సహకరించి, అకాడమీ ఏర్పాటుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నచేస్తానని ఈ సందర్భంగా టిజి వెంకటేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement