Friday, November 22, 2024

TG – తాగుడుకి ఖ‌ర్చు పెట్ట‌డంలో మ‌న‌వాళ్లే ఫ‌స్ట్…

మందు విక్ర‌యాల‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్
ఆ త‌ర్వాత ప్లేస్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్
తెలంగాణ‌లో ఒక్కొక్క‌రి మందు ఖ‌ర్చు రూ.1623
బెంగాల్,ఎంపి, యుపి, రాజ‌స్థాన్ ల‌లో త‌క్కువ ఖ‌ర్చు
బీర్ల తాగ‌డంలోనూ తెలంగాణ‌కే ప‌ట్టం

హైద‌రాబాద్ – మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా తీసిన మద్యం విక్రయాల గ‌ణాంకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) ప్రకారం తెలంగాణలో గతేడాది సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఏపీలో రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు పేర్కొంది.

ఈ రాష్ట్రాల‌లో తాగుడు ఖ‌ర్చు త‌క్కువే..

ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నాయని అంచనా. ఇది ఇలా ఉంటే తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, పబ్బులు ఉన్నాయి. దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు విక్రయించారు.

బీర్ల అమ్మ‌కాల‌లోనూ తెలంగాణ‌కే ప‌ట్టం ..

- Advertisement -

ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బీరు కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బీర్ల కోసం రూ.302.84 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. నెల‌కు స‌రాస‌రి 16 ల‌క్ష‌ల కేసుల బీర్ల‌ను తెలంగాణ వాసులు తాగుతున్న‌ట్లు తాజా లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement