హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, జి.సృజనలు క్యాట్ లో ఎదురు దెబ్బ తగిలింది.. ముందుగా నిర్దేశించిన ప్రకారం తమకు కేటాయించిన రాష్టాలకు వెళ్లి విధులలో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.. తెలంగాణకు చెందిన నలుగురు,ఎపికి చెందిన ఒక ఐఎఎస్ అధికారి డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. పిటిషనర్ల తరుపున క్యాట్ ముందు తమ వాదనలు వినిపించారు.. అనంతరం వారి పిటిషన్ లు కొట్టివేస్తూ,టివోపిటీ ఆదేశాలను పాటించాల్సిందేనని,దీనిపై ఎటువంటి మినహాయింపులు లేవని క్యాట్ తుదితీర్పు ఇచ్చింది.
అయితే ఈ తీర్పుపై ఈ అయిదుగురు ఐఎఎస్ లు హైకోర్టును అశ్రయించనున్నారు.. ఈ మేరకు రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.. డివోపిటి ఆదేశాల ప్రకారం ఈ అయిదుగురు రేపే తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లవలసి ఉంది.. చివరి ప్రయత్నంగా హైకోర్టు మెట్టు ఎక్కనున్నారు..