Tuesday, November 12, 2024

TG Govt | నలుగురు ఐఏఎస్‌ అధికారులు రిలీవ్‌ – కొత్త ఇన్‌చార్జిలు వీరే

హైదరాబాద్ – తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన అధికారుల స్థానంలో ఇన్‌చార్జిలను ప్రభుత్వం నియమించింది. టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్‌వీ కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో కొనసాగుతున్న అధికారులు తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిని ఏపీకి, అక్కడ పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణ వెళ్లాలని చెప్పింది. అధికారులంతా క్యాట్‌ను ఆశ్రయించారు.

అయితే, అధికారుల అభ్యర్థలను క్యాట్‌ తోసిపుచ్చింది. విచారణను నవంబర్‌ 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అయితే, క్యాట్‌ స్టే ఇవ్వకపోవడంతో అధికారులంతా హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ఆలిశెట్టి ధర్మాసనం విచారణ జరిపింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాలని చెప్పింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరిస్తామంటూ మొదట ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్‌ చేసింది.

ఇక ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు సృజన, శివశంకర్‌, హరికిరణ్‌ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రిపోర్ట్‌ చేయగా.. తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌ అధికారులు రిలీవ్‌ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement