ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతితో పాటు విజన్ 2047తో పాటు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై చర్చించారు.
దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో వివరంగా మాట్లాడినట్లు తెలిపారు. పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, ఆవిష్కరణలను పెంచడంలో అయనతో చర్చ చాలా ప్రభావవంతంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో విజన్ 2047తో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక లోటులో ఉన్నా సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామన్నారు.