Friday, October 18, 2024

TG/AP – క్యాట్ ను ఆశ్రయించిన బ‌దిలీ ఐఎఎస్ లు

ఢిల్లీ: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆదేశాలు సైతం జారీ చేశారు.

అయితే డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ ను నేడు ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఇదే విధంగా ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది.

- Advertisement -


ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని దరఖాస్తు పెట్టుకున్న ఎస్.ఎస్.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ తిరస్కరించింది. దీంతో వీరిద్దరూ ఆంధ్రాలోనే కొనసాగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement