Friday, November 22, 2024

ఆగస్టు ఆరు నుంచి టెట్ ప‌రీక్ష‌లు.. విడుదలైన నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెర వేస్తూ ప్రభుత్వం టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2018లో చివరిసారి టెట్‌, డీఎస్సీ నిర్వహించిన తర్వాత మళ్లి నోటిఫికేషన్‌ ఇదే. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు టెట్‌ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డీఎల్‌ఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌, తత్సమాన అర్హత ఉన్న వారు, 2020- 22లో పూర్తి చేస్తున్న వారు టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా పేపర్‌- 1 ఎ అండ్‌ బీ, పేపర్‌- 2 ఏ అండ్‌ బీ జరుగుతాయి. 1 నుంచి ఐదో తరగతుల బోధన చేయాలనుకునే వారు పేపర్‌ 1- ఎ, 6 నుంచి 8 తరగతులు, లాంగ్వేజ్‌ పండిట్లు పేపర్‌- 2 ఎకు దరఖాస్తు చేసుకోవాలి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోసం 1బి, 2బికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టులో పరీక్షలు..

ఆగస్టు ఆరో తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజూ రెండున్నర గంటలు చొప్పున 2 సెషన్లలో టెట్‌ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి అవసరమైతే సెషన్లు పెంచడం లేదా తగ్గించడం ఉంటుంది. టెట్‌ కోసం అభ్యర్థులు ప్రతి పేపర్‌ఒకు రూ. 500 చొప్పున ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 15 నుంచి జూలై 15వ తేదీలోపు చెల్లించాలి. అలాగే ఈ నెల 16 నుంచి జూలై 16 వరకు సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు చేశాక, మార్పుచేర్పులు చేయాలంటే మళ్లి రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెట్‌ కోసం ఏపీ, తెలంగాణలతోపాటు బెంగళూరు, చెన్నై, ఒడిశాలలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ తరహాలో పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సంఖ్య పరిమితి దాటగానే మరో కేంద్రానికి మారుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement