Tuesday, January 7, 2025

Terror – శ్రీశైలంలో పూజారి ఇంట్లో చిరుత … ఆందోళనలో గ్రామస్తులు…

నంద్యాల బ్యూరో – … శ్రీశైలంలో పూజారి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత కనపడటం కలకలం రేగుతుంది. గత రాత్రి పూజారి ఇంట్లో కి చిరుత వచ్చిన దృశ్యం సీసీ కెమెరాలు బయటపడటంతో కుటుంబం అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతాళ గంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత ఇంటిలోకి ప్రవేశించింది. ఇంట్లోని వరండాలో తిరిగింది. పెంపుడు కుక్కల కోసం ఈ చిరుత తరచూ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి గతంలో కూడా వచ్చినట్లు తెలుస్తోంది
దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో కూడా సున్నిపెంట పరిసర ప్రాంతాల్లో రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారి ఇంట్లోకి చిరుత వెళ్లి రెండు కుక్కలపై దాడి చేసింది. మరో ఇంటిపై గోడమీద కూర్చున్న చిరుతను చూసిన సంఘటన జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరావు దేవస్థాన పరిధిలో ఉన్న వారందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మనం అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లకూడదని గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించారు.

నల్లమల్ల అటవి ప్రాంత పరిసరాల్లోని గ్రామాలలో ప్రజలు చిరుత ఇండ్లలోకి ప్రవేశించటం పెంపుడు కుక్కలపై దాడులు చేయటం తో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల క్రితం పుణ్యక్షేత్రమైన మహానంది పరిధిలో కూడా చిరుత కలకలం రేపింది. మహానంది నుంచి బోయలకుంట్ల కు వెళ్లే రహదారి ప్రాంతంలోని వ్యవసాయ కళాశాల సమీపంలోని కూడా చిరుత కనపడి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.మహానందిలోని గోశాల పక్కన చిరుత మాట వేసిన సంఘటనలు ఉన్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల గ్రామనికి చెందిన ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసి తల తీసుకువెళ్లిన సంఘటన జరిగింది. గాజుల పల్లె సమీప ప్రాంతంలో రైల్వే ట్రాక్పై పనిచేయుచున్న జార్ఖండ్ వాసులపై కూడా చిరుత దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement