ఎపి టెన్త్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ప్రకటించారు.. కాగా, గత నెల 18న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. స్పాట్ వ్యాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశారు అధికారులు. ఇప్పుడు ఫలితాల విడుదల చేశారు.
ఇక, టెన్త్ ఫలితాల కోసం.. https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి.. హోమ్ పేజీలో అందుబాటులో ఏపీ టెన్త్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి… హాల్ టికెట్ వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే.. రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. ఫలితాలను ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మరోవైపు. manabadi.co.in లాంటి వెబ్‌సైట్లలో కూడా ఏపీ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంచనున్నారు.