Tuesday, November 26, 2024

రేపు ఉద‌యం 11గంట‌ల‌కు టెన్త్ రిజ‌ల్ట్‌.. ప్ర‌క‌టించిన విద్యాశాఖ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-2022 అకడమిక్ ఇయ‌ర్ కి సంబంధించిన‌ SSC 10వ తరగతి పరీక్షలు ముగిసిన సంగ‌తి తెలిసిందే.. AP బోర్డు SSC పరీక్షలను 27 ఏప్రిల్ నుండి 9 మే 2022 వరకు వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించింది. అయితే ఇప్పుడు విద్యార్థులందరూ 10వ తరగతి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారు. శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు రిజ‌ల్ట్స్ విడుద‌ల చేస్తాం అని ప్ర‌క‌టించినప్ప‌టికీ అది సోమ‌వారానికి వాయిదా వేశారు అధికారులు. కాగా, AP SSC ఫలితాలు జూన్ 6వ తేదీన‌ ఉదయం11:00 గంటలకు రిలీజ్ అవ్వ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి SSC ఫలితాలని.. మెమోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చ‌ని తెలిపారు.

ఇక‌.. డిపార్ట్‌మెంట్ విజయవంతంగా మూల్యాంకన ప్రక్రియను నిర్వహించిందని, మార్కుల జాబితా తయారీ కూడా ప్రారంభ‌మైన‌ట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 10వ తరగతి పరీక్షకు మొత్తం 6,22,537 మంది విద్యార్థులు (బాలురు -320063) (బాలికలు – 302474) హాజరయ్యారు. APలోని మొత్తం 3,776 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్ష నిర్వ‌హించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement