అమరావతి, ప్రభన్యూస్ : రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి. దేవానంద రెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో స్కూల్ కోడ్‌ను యూజర్ నేమ్‌గా, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థులకు హాల్‌టికెట్లను అటెస్ట్ చేసి అందించాలన్నారు. ఎవరైనా విద్యార్థుల ఫొటోలు ముద్రణ కాకపోవడం, వేరే విద్యార్థి ఫొటో ముద్రించడంలాంటివి హాల్ టికెట్లపై గుర్తిస్తే ప్రధానోపాధ్యాయులు సరైన ఫొటోను అంటించి, అటెస్ట్ చేసి అందించాలని సూచించారు.
అలాగే అటెస్ట్ చేసి విద్యార్థులకు అందించిన హాల్ టికెట్ కాపీని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ప్రధానోపాధ్యాయులు అందజేయాలని సూచనలు చేశారు. డీజీఈ వెబ్‌సైట్‌లో ఫొటో చేంజ్ అప్లికేషన్ ఉంటుందని, హెడ్ మాస్టర్లు వాటిని పూర్తి చేసి పరీక్షలు పూర్తయ్యేలోగా పంపాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..