అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు..
గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2020 నుంచి గ్రేడ్‌ల స్థానంలో విద్యార్థులకు మార్కులు ప్రధానం చేసే పద్దతిని ప్రవేశపెట్టామన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం విద్యార్థులకు ఎటువంటి ర్యాంక్‌లను కేటాయించడం లేదని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పాఠశాల యాజమాన్యాలు ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల కోసం ఏ స్థాయిలోనైనా ర్యాంకులు ప్రకటించడం, ప్రచురించడం నిషేధించడం జరిగిందన్నారు. 1997 చట్టం 25 సెక్షన్ 8 ప్రకారం ఎవరు ఉల్లంఘించినా, ఉల్లంఘించే ప్రయత్నం చేసినా, కుట్ర చేసినా లేదా ప్రోత్సహించినా మూడు సంవత్సరాలకు పైబడి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని, జైలు శిక్షతో పాటు- జరిమానా ఐదు వేల నుంచిలక్ష రూపాయల వరకు విధించడం జరుగుతుందని దేవానంద్ రెడ్డి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..