Friday, November 22, 2024

Tension – ప‌ల్నాడులో అప్ర‌క‌టిత క‌ర్ప్యూ …. 144 సెక్ష‌న్ అమ‌లు

న‌ర‌స‌రావుపేట – పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ‌త రాత్రి నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇక గ‌త రాత్రి నుంచి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి మకాం వేశారు. పల్నాడు ఎస్పితో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో, ఏకంగా 2300 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు. మరోవైపు పలనాడులో అనేక ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న‌ది.. దీంతో షాపులు తీసేందుకు వ్యాపార వర్గాలు విముఖత చూపిస్తున్నారు. నిన్న రాత్రి నుండి దుకాణాలు పలు వ్యాపార వర్గాలు మూసేసాయి. కాగా వైసిపి నేత‌లు కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ , పిన్నెల్లి త‌దిత‌రులు ఉంటున్న నివాసాల వ‌ద్ద భారీ గా పోలీసులు మోహరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement