Thursday, November 21, 2024

కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ నేతపై దాడి.. గాల్లోకి కాల్పులు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి స్కూల్ వెనకాల మసీదు నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ శ్రీశైలం నియోజకవర్గ బీజేపి ఇంచార్జీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. బడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వాహన అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ రెడ్డి వాహనాన్ని మరో వర్గం వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం వేగంగా నడపడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు చేశారు. శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మైనార్టీలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.  అవాంఛనీయి సంఘటనలు జరుగకుండ రెండు వర్గాల వారిని పోలీసులు వారించారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన రాత్రి పది గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్నారు. మత పెద్దలతో చర్చలు జరిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement