మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటికి చేరుకోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పోలీసులు మాత్రం అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామన్నారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై నల్లజర్ల పీఎస్ లో కేసునమోదైన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital