ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు చెందిన ఎనిమిది సెంట్ల భూమిని ఆక్రమించారంటూ ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆందోళనకు దిగారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.అయితే ధర్నాకు దిగిన శ్రీనివాసరావుకు జనసేన పార్టీ నేతలు మద్దతు తెలిపారు. జనసేన పార్టీకి చెందిన శ్రీనివాసరావు స్థలం ఆక్రమణకు గురైందని, తమకు చంద్రబాబు న్యాయం చేయాలంటూ బాధితుడు అక్కడ ధర్నాకు దిగారు. శ్రీనివాసరావుకు జనసేన మద్దదతు తెలిపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement