ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ.. తాడేపల్లిలో భీమా మిత్రలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుండి సీఎం క్యాంప్ కార్యాలయానికి బయల్దేరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వైయస్సార్ బీమా పథకాన్ని నిర్వహించే బాధ్యతలు తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. సీఎం నివాసం వైపు భారీ ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకుని… స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమ్మల్ని మోసం చేశారని బీమా మిత్రలు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి.. తర్వాత తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీమా మిత్రలను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని బీమా మిత్రలు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital