(పెనుగంచిప్రోలు, ప్రభ న్యూస్)
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగిండ్లపాడు గ్రామంలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు సర్పంచ్ జ్యోతి బ్రహ్మం కు సంబంధించిన లారీకి నిప్పు అంటించారు. దీంతో గ్రామంలో ఉధృత వాతావరణ చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామానికి చెందిన ఓశెట్టి త్రినాధను అదుపులో తీసుకొని తీసుకొని వెళ్తుండగా సీఐ వాహనంపై దాడి చేసి వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో గ్రామాలు ఉదృత వాతావరణం చోటుచేసుకుంది డి.ఎస్.పి జనార్దన్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో చర్చించి నిందితుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలో గ్రాముల హల్చల్ చేస్తూ భయాందోళన గురి చేస్తున్నారని గతంలోనూ సర్పంచ్ సర్పంచ్ వాహనంలో డీజిల్ ట్యాంకులో పంచదార పోసి వాహనాన్ని ధ్వంసం చేశారని తిరిగి మరల శుక్రవారం తెల్లవారుజామున సర్పంచి సంబంధించిన లారీకి నిప్పంటించడంతో లారీ పూర్తిగా దగ్ధం కాగా లారీలో ఉన్న వరి కోత మిషన్ సైతం నిప్పు అంటుంది న్యాయం చేయాలని సర్పంచ్ స్థానిక శాసనసభ్యులను కోరుతున్నారు. గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు నిర్వహించి రామలు 144 సెక్షన్ విధించారు.