Thursday, January 16, 2025

AP | కర్నూలు జిల్లాకు పదివేల కోట్లతో రిలయన్స్ ప్రాజెక్ట్

కర్నూలు బ్యూరో : సంక్రాంతి పండగ తర్వాత కర్నూలు జిల్లాకు మరో శుభవార్త అందింది. ఈ శుభ పరిణామం కు కారణం మరో భారీ సౌర్య ప్రాజెక్టు రాను ఉండటమే. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది.

వీటివల్ల వేలాది మందికి పైడా ఉపాధి అవకాశాలు ల‌భించ‌నున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓర్వకల్ మండల పరిధిలో ఇండస్ట్రియల్ హబ్బు పట్ల ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రీన్ కో వంటి సంస్థ కర్నూలుకు తరలివచ్చి, గాలి,సౌర‌, పవన విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు నెలకొల్పిన సంగతి విధితమే.

- Advertisement -

కర్నూలుకు మరో భారీ ప్రాజెక్టు

ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టును రిలయన్స్ సంస్థ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. అతి పెద్ద సౌర ప్రాజెక్టును నెలకొల్పేందుకు రిలయన్స్ ఎస్ యూ సన్ టెక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు కర్నూలు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఇప్పటికే రిలయన్స్ సంస్థ ప్రతినిధులు దీనికి సంబంధించిన భూములను పరిశీలన చేసి వెళ్లడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రెండు స్థలాలను ఎంపిక చేశారు. వీటిలో ఒకటి రిలయన్స్ సంస్థ ఫైనల్ చేసే అవకాశం ఉంది.

పది వేల కోట్ల పెట్టుబడితో..

పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ తో పాటు 465 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించే సమయంలోనే వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఇది ప్రత్యక్షంగా లభించే ఉపాధి మాత్రమే.

పరోక్షంగా మరో రెండు వేల మంది ఉపాధి పొందే అవకాశముంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉందని, అందుకు సంబంధించిన ఒప్పందంకూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బీఓటీ విధానంలోఈ సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి లభించే విద్యుత్తును వివిధ విద్యుత్తు సంస్థలకు పంపిణీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement