Saturday, January 4, 2025

Temples Rush – భక్తులతో పోటెత్తిన ఆలయాలు

హైదరాబాద్ – కొత్త సంవత్సరం వేళ.. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం తొలిరోజు బాగుంటే.. ఏడాదంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో కొంతమంది ఆలయాలకు వెళ్తున్నారు . ఈ ఏడాది అంతా సంతోషంగా ఉండేలా దీవించమని కోరుతున్నారు. నూత‌న సంవ‌త్స‌రం రోజున త‌మ ఇష్ట దైవాన్ని ద‌ర్శించుకుని, అంతా శుభం జ‌ర‌గాల‌ని భ‌క్తులు కోరుకుంటున్నారు. ఇక భ‌క్తుల తాకిడిని ముందే ఊహించిన ఆల‌యాల అధికారులు.. వారి ర‌ద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణాలో..

తెలంగాణ‌లోని యాదాద్రి, భ‌ద్రాద్రి, వేముల‌వాడ‌, జోగులాంబ‌తో పాటు ఇత‌ర ఆల‌యాల‌కు భ‌క్తులు బారులు తీరారు. ద‌ర్శ‌నానికి 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని చిలుకూరు బాల‌జీ టెంపుల్, బిర్లా మందిర్, పెద్ద‌మ్మ త‌ల్లి ఆల‌యం, జూబ్లీహిల్స్, హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని టీటీడీ ఆల‌యాలు, ప‌ద్మారావు న‌గ‌ర్‌లోని స్కంధ‌గిరి టెంపుల్‌కు భ‌క్తులు పోటెత్తారు.

అంధ్రప్రదేశ్ లోనూ..

- Advertisement -

2025 తొలి రోజున తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ఈ కొత్త ఏడాది అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతున్నది.. ఇక సింహచలంలోని సింహద్రి అప్పన్న, అన్నవరంలోని సత్యదేవుడు, పంచారామాలు, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న తదితర ఆలయాలు భక్తులతో పోటెత్తాయి..

ఉత్తరాదిలోనూ..

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అస్సిగాట్లో కొత్త సంవత్సరం తొలిరోజు గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాలయంలో భస్మహారతి కార్యక్రమం నిర్వహించారు. కొత్త సంవత్సరం తొలి రోజున భక్తులు భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు.

ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ఉదయం హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం బంగారు కాంతులతో మెరిసిపోయింది. కొత్త సంవత్సరంలో స్వర్ణ దేవాలయం దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.అయోధ్యలోని బాలరాముడి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తుల రాక ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement