Thursday, November 21, 2024

AP | రెండు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య బంగాళా ఖాతం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

అలాగే ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఉరుములతో కూడిన మెరుపులు మరికొన్ని ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందని సూచించారు. మంగళవారం కావలి, నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement