తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం అని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది.