Tuesday, November 26, 2024

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. గజగజ వణుకుతున్న జనం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు ఉద్ధృతంగా గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే శీతల గాలులు వీస్తున్నాయని, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైంది. సోనాలా లో 5.2, బజార్‌ హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని 

మరోవైపు ఏపీలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ పొగమంచు కురుస్తోంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సోమవారం విశాఖ ఏజెన్సీ జి.మాడుగులలో 6.8, ముంచంగిపుట్టులో 8.0, చింతపల్లిలో 8.4, అరకులోయలో 8.5, అనంతపురంలో 13.9, ఆరోగ్యవరంలో 14.5 డిగ్రీలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement