Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాలను చలి చంపెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేని జనం వణుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాలనుంచి వీస్తున్న చలి గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. విశాఖపట్నం ఏజెన్సీలోని జి.మాడుగులలో ఆరు డిగ్రీల సెల్సియస్, తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో 8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని నిర్మల్, అదిలాబాద్, మంచిర్యాల, కొమ్రంభీం జిల్లాల్లో అల్యత్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరోవైపు ఏపీలోని విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్యం చలికి గజగజ వణుకుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. చలికి తట్టుకోలేక సూర్యుడు కాస్తంత బయటకి వస్తే తప్ప జనం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. శనివారం చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement