Friday, November 22, 2024

Telugu Desam – తొలిసారిగా పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో భువ‌నేశ్వ‌రి చ‌ర్చ‌లు – పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు ప్ర‌ణాళిక‌లు

రాజమండ్రి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తొలిసారి పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ తో కలిసి ఆయన యువగళం పాదయాత్రకు వాడుతున్న బస్సులోనే భువనేశ్వరి ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కాగా, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గత మూడు రోజులుగా యాక్టివ్ ఉన్నారు. పార్టీని ముందుకు నడిపేందుకు తానున్నానంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, కుటుంబసభ్యులు భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలు మంగ‌ళ‌వారం నాడు రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

ఆ సమయంలో చంద్రబాబు చేసిన సూచనలతోనే కుటుంబసభ్యులు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నట్టు స‌మాచారం. నారా లోకేష్ తో పాటు అక్క‌డే కూర్చున్న భువ‌నేశ్వ‌రి తొలిసారిగా పార్టీ గురించి, కార్య‌క‌లాపాల గురించి అక్క‌డ ఉన్న నేత‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.. వారితో త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు.. భువ‌నేశ్వ‌రీతో పాటు బ్ర‌హ్మ‌ణి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు…చంద్ర‌బాబు లేని లోటు తెలీయ‌కుండా పార్టీ ని ముందుకు న‌డిపించేందుకు నారా లోకేష్, భువ‌నేశ్వ‌రీ, బాల‌కృష్ణ‌లు సీనియ‌ర్ ల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్నారు… అవ‌స‌ర‌మైతే నారా బ్ర‌హ్మ‌ణి యువ‌గ‌ళం పాద‌యాత్ర చేప‌ట్టే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ‘బాబుతో నేను’ కార్యక్రమంతో టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇంకా కొద్ది రోజుల వరకు చంద్రబాబు జైల్లోనే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement