వికారాబాద్, జనవరి 10 (ఆంధ్రప్రభ) : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇవాళ ఉదయం తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు.
అనంతరం ఆయనను ఆలయ పురోహితులు సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండరెడ్డి ఓ ఎస్ డి వెంకటేశం, శ్యామల, రఘుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.