Wednesday, November 13, 2024

అక్రమాస్తుల కేసు: జగన్ వ్యక్తిగత హాజరుపై తీర్పు రిజర్వ్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయిపు ఇవ్వొద్దని హై కోర్టుకు సీబీఐ విన్నవించారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని గుర్తు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరుపు న్యాయవాది వాదించారు. పదేళ్లయినా కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉన్నాయని, హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ పై పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement