నంద్యాల బ్యూరో, డిసెంబర్ 30 : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని బ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సతీమణి సుధా దేవ్ వర్మలు ఆలయాన్ని సందర్శించారు.
దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. దేవాలయ ప్రాంగణం అంతటినీ పరిశీలించారు. మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం చేపట్టారు.
- Advertisement -