Tuesday, September 17, 2024

AP | టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ కారు ప్రమాదం…

తాజాగా వైసీపీ టెక్కలి ఇంచార్జిగా నియమితులైన పేరాడ తిలక్ కలకలం సృష్టించారు. శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం నందిగాం సమీపంలో తిలక్ ప్రయాణిస్తున్న కారు అదుపు త‌ప్పి… ఎదురుగా వెళ్తున్న‌ కారు, ఆటోను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement