నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారం.. నలుగురు మధ్యకు చేరింది. రచ్చకు దారి తీసింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యవహారం ఒక్కసారిగా బయటకురావడంతో తట్టుకోలేక పోయారు. కోపాలు పెరిగిపోయాయి. నియంత్రించుకోలేని స్థాయికి చేరింది. చివరకు రాత్రి వేళ భార్య వాణి, కూతురుపై దాడికి ప్రయత్నించాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. పోలీసులు అడ్డుకోవడంతో వాణి, ఆమె కూతరు సేఫ్. ఇంతకీ అసలు మిడ్‌నైట్ ఏం జరిగింది?
………………………………………………………………………………………………………….
ఆంధ్రప్రభ స్మార్ట్ – టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీలో పాపులర్ పర్సన్. ప్రత్యర్థిపై మండిపడుతూ మీడియా ముందు కంటతడి పెట్టి అధినేత జగన్‌ను ఆకట్టుకున్ననేత. అన్నట్లు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? దువ్వాడ విషయంలోనూ అదే జరిగింది. దీంతో దువ్వాడ శ్రీను ఫ్యామిలీలో అంతర్గత కలహాలు క్రమ క్రమంగా పెరిగి ముదిరిపాకాన పడ్డాయి. ఏ రోజూ బయటపడిన సందర్భాలు రాలేదు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ దువ్వాడ శ్రీను ‘నారీ నారీ నడుమ మురారి’ ఇంటిగుట్టు బయటకువచ్చింది.
తండ్రి కావాలంటూ కుమార్తెలు, భర్త తిరిగి రావాలంటూ భార్య దువ్వాడ వాణీలు వైసిపి ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గురువారం హంగామా సృష్టించారు. దీనికి కౌంటర్ గా దువ్వాడతో ఉంటున్న మాధురి నిన్న మీడియా సమావేశం పెట్టి వాణిని దుమ్మెత్తి పోశారు.. దువ్వాడ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది.. అతడితోనే తాను ఉంటునంటూ తేల్చేసింది.. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ వాణి ఆమెతో తాడో పేడో తేల్చుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్దకుమార్తె హైందవితో వెళ్లారు. తల్లీ కూతురు అక్కడకు వచ్చిన విషయం దువ్వాడ శ్రీను, ఆయన సోదరుడుకి తెలిసింది. అనుచరులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వస్తూ.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తిట్ల దండకంతో బూతు పురాణం మొదలుపెట్టారు.
ఇంటి నిర్మాణానికి వినియోగించే వస్తువు సామాగ్రితో భార్య వాణి, కూతురుపై దాడికి చేయబోయాడు దువ్వాడ శ్రీను. అయితే పోలీసులు ఆమెకు వలయంగా మారారు. దువ్వాడ శ్రీనును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు భార్య వాణి, కూతురు హైందవి బైఠాయంచారు. అసలు మాధురికి ఉన్న ముగ్గురు సంతానానికి డిఎన్ ఎ టెస్ట్ చేయాలని, అప్పడు తన భర్త అసలు స్వరూపం తెలుస్తుదంటూ వాణి కోరింది.. దీనిపై గట్టిగా పట్టుబట్టినా పోలీసులు కన్వీన్స్ చేయడంతో పరిస్థితి కాస్త కూల్ అయ్యింది.
ఇంటి పోరుకు సూత్రధారి వాణి
గత కొన్నేళ్లుగా స్థానిక వైసిపి నాయకురాలు మాధురి ఎమ్మెల్సీతోనే ఉంటున్నది.. ఆమె ఎంటర్ అయిన తర్వాతే శ్రీనివాస్ కుటుంబాన్నిదూరం పెట్టాడనే అరోపణలు వినవస్తున్నాయి.. ఇదే వాస్తవం అంటూ దువ్వాడ భార్య, కుమార్తెలు అంటున్నారు.. అయితే దువ్వాడ కు, తనకు మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు. తన భర్త మెరైన్ ఇంజినీరుగా పనిచేస్తున్నారని, ముగ్గురు చిన్న పిల్లలున్నారని చెప్పారు. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు. దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య విభేదాలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని ఆమె అన్నారు.
భార్యకు విడాకులిస్తా… దువ్వాడ
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు. భార్యాపిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు వాణి, తన కూతురు హైందవి సహా ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. వాణితో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య వాణి, కూతురు కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా తనను వేధిస్తున్నారని వాపోయారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఎస్పీ తిరస్కరించారని చెప్పారు. తాజాగా వాణి, ఆమె అనుచరులు తన ఇంటిపై దాడి చేయడంతో గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
పదవులతో ముదిరిన ఇంటి రగడ …
వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నుంచి దువ్వాడ శ్రీనుకు ఇంటి రగడ మొదలైంది. కాకపోతే తన టాలెంట్‌తో ఆ విషయాన్ని సెలైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల్లో దువ్వాడ శ్రీను భార్య వాణి పోటీ చేశారు.. జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భార్య భర్తలు మధ్య ఎడబాటు మరింత పెరిగింది.
ఈ టార్చర్ తట్టుకోలేక జగన్ వద్దకు వెళ్లిన దువ్వాడ, నియోజకవర్గానికి తన భార్య వాణిని ఇన్‌ఛార్జ్ చేయా లని రిక్వెస్ట్ చేశారు. పరిస్థితి గమనించిన జగన్, అలాగే అని చెప్పి వారిని పంపించారు. అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు టెక్కలి నుంచి దువ్వాడశ్రీను ప్రకటించింది ఆ పార్టీ. దీంతో భార్యభర్తల మధ్య వివాదం మరింత ముదిరింది. తారాస్థాయికి చేరి చివరకు బయటకు వచ్చింది. మరి ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.