Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు.. పట్టాభిరామ్

AP | స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు.. పట్టాభిరామ్

0
AP | స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు.. పట్టాభిరామ్

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలన్స్ అవసరమ‌ని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో గురువారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ విజయవాడ కోసం సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ మాట్లాడుతూ… స్వచ్ఛతకు సాంకేతికత ఎంతో అవసరమని అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ ని వాడుతూ పారిశుధ్య నిర్వహణను మెరుగు పరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పని చేయాలన్నారు.

స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… వ్యర్థ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డ్రోన్ల నిర్వహణను సమన్వయం పరుస్తూ డ్రోన్ సర్వేలెన్సు ద్వారా ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎలా తీర్చవచ్చు, ఎలా తీర్చగలం లాంటి అంశాలపై చర్చించారు. నగర పాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ… నగరంలో ఉన్న వ్యర్ధ నిర్వహణలో ఉన్న పలు సమస్యలను వివరించారు. దోమలు పెరగకుండా ఉండేందుకు, బ్లాక్ స్పాట్స్ ను గుర్తించేందుకు, కుక్కలు, ఆవుల వివరాలు సేకరించేందుకు, ఇతర అంశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ సర్వే లైన్స్ పని చెయ్యాలన్నారు.

ఈసమావేశంలో స్వచ్చంద్ర కార్పొరేషన్ యం సి 1 భాగ్యలక్ష్మి, యం సి 2 దశరథ్ రామి రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీరామచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ పిసత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంచార్జ్ వెహికల్స్ ఎస్ పాదం, బయాలజిస్ట్ సూర్య కుమార్, డ్రోన్ టీం సభ్యులు, నియో స్కై నిపుణులు శరత్చంద్ర, హను, పాల్గొన్నారు.

Exit mobile version