పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చిన సంఘటన ఇది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడే కామంతో కళ్లు మూసుకుపోయి పాఠశాలలో చదివే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల బ్రహ్మణపల్లెలోని సీఎం ఇలాకాలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎంపీపీ స్కూల్లో 3వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు గురి చేశాడు. బాలికల పట్ల ఉపాధ్యాయుడు శివశంకర్ అసభ్య ప్రవర్తించాడని విద్యార్థినులు చెబుతున్నారు. తరగతి గదిలోకి పిలిపించుకుని ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు చేసేవాడని, విద్యార్థినులతో ఇష్టానుసారం ప్రవర్తించేవారని ఆరోపించారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పిల్లలు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శివశంకర్ని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు.
సీఎం ఇలాకాలో దారుణం.. విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు
Advertisement
తాజా వార్తలు
Advertisement