అమరావతి, ఆంధ్రప్రభ: ట్రన్స్‌ఫర బుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల కుంభకోణం టీడీపీ హయాంలోనే జరిగిందని దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం అసెంబ్లిd మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 16, 2018న టీడీఆర్ బాండ్లకు సంబంధించిన లెటర్‌ను మునిసిపల్ కమిషనర్ తీసుకున్నారన్నారు. 1987లోనే తణుకు ప్రాంతంలో గ్రీన్‌బె ల్ట్ ఏర్పాటు చేశారని టీడీపీ చెందిన ఒకే సామాజిక వర్గం వారే ఇందులో ఉన్నారన్నారు. దీనిపై విచారణ నిర్వహించాల్సిందిగా సంబంధిత మంత్రిని తాను స్వయంగా కోరానన్నారు.
టీడీపీ నాయకులు పట్టాభి వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే తాను రాజకీయ సన్యానికి సిద్ధమని లేదంటే చంద్రబాబు చేస్తారా అని సవాల్ విసిరారు. ఈఎస్‌ఐ స్కాంలో చిక్కుకొని అచ్చెం నాయుడు, ధూళిపాళ నరేంద్ర జైలుకు వెళ్లొచ్చారన్నారు. నెలవారీ జీతానికి పనిచేస్తున్న పట్టాభి నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పళ్ళు రాలకొడతానని హెచ్చరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టరని హెచ్చరించారు.