Sunday, September 8, 2024

టీడీపీ తీన్మార్…కడప కోటలో పాగా …

అనంతపురం – టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ కి షాక్ ఇచ్చింది. జగన్ కంచుకోట కడపలో సైతం సైకిల్ జోరు పెరిగింది ,,జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కలసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించి ఫ్యాన్ కు టీడీపీ షాక్ ఇచ్చింది.వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇప్పటికే తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కైవసం చేసుకోగా తాజా గా పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజక వర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.

అనంతపురము నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శనివారం రాత్రి 08:00 గంటల వరకు నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ తెలిపారు.

DIPRO.I&PR.ATP

Advertisement

తాజా వార్తలు

Advertisement