Thursday, November 21, 2024

మా పిల్ల‌ల‌కు ఒక్క ఛాన్స్ ప్లీజ్ – బాబుకి సీనియ‌ర్లు వేడికోలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వారసుల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడికక్కడ అధికార, విపక్ష పార్టీల సీనియర్‌ నేతలు తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కుమారులు లేదా కుమార్తెలను వచ్చే ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి టిక్కెట్‌ తమకు ఇవ్వకున్నా పర్వాలేదు… కానీ తమ వారసులకు అవకాశం ఇవ్వమంటూ పార్టీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా స్థానిక నాయకత్వాలకు సంకేతాలు ఇస్తూ నియోజక వర్గాలలో బిజీ బిజీగా వుంటు-న్నా రు. ఈ తరహా పరిస్థితి- ప్రతిపక్ష టీ-డీపీలో అధికంగా ఉంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వారసుల రాజకీయం నడుస్తోంది. దాదాపు 15 మందికి పైగా సీనియర్‌ నేతలు తమ వారసులను ఈ సారి ఎన్నికల్లో పోటీ- చేయించాలని బావిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏకంగా అధిష్ఠానం పెద్దల దగ్గరే తమ మనసులోని మాటను చెప్పేస్తు వారసులకు లైన్‌ క్లియర్‌ చేసే ప్రయత్నాలు చేస్తు న్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ- రాకున్నా, ఎవరి ప్రయత్నాలు వారు మాత్రం చేస్తున్నారు. గతంలో సైతం కొందరు సీనియర్లు ఈ తరహా ప్రయత్నాలు చేసినా వారిలో చాలా కొద్దమంది మాత్రమే సక్సెస్‌ అయ్యారు.

అయితే ఈసారి ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లను కేటయిస్తామని చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఇదే సరైన అవకాశంగా భావించి తిరిగి ఇప్పుడు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయ వారసులకు మంచి ప్లాట్‌ఫామ్‌ ఇవ్వాలనే ఆలోచనలో మునిగిపోయారు. ఇదే సమయంలో టీ-డీపీ అధిష్టానం కుటు-ంబంలో ఎవరి-కై-నా ఒక్కరికే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పింది. అయినా కొందరు రెండు సీట్ల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొందరు తమ వారసులకు సీటు- దక్కితే చాలు అన్న ఆలోచన వున్నారు. ఈ జాబితాలో టీ-డీపీ సీనియర్‌ నేతలు యనమల, జేసీ బ్రదర్స్‌, కళా వెంకట్రావు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు వున్నారు. యనమల ఈసారి తుని నుంచి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపాలనే యోచనలో వున్నారు. ఇప్పటికే ఆమెను నియోజక వర్గం ఇంఛార్జిగా అధిష్టానం నియమించింది.

జేసీ బ్రదర్స్‌ తనయులు పవన్‌, అశ్మిత్‌ పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో ఇప్పటికే బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో టీ-డీపీ నుంచి రంగంలోకి దిగేందుకు వారసులు సిద్ధమవుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ టీ-డీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడిగా తరచూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటు-న్నారు. దీంతో ఆయన కుమారుడు రామ్‌ మల్లిక్‌ నాయుడు ఇపుడు నియోజకవర్గంలో తండ్రి తరపున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ- చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు సీట్ల కోసం మరికొందరు
ఇది ఇలావుంటే, టీ-డీపీలో రెండు సీట్ల కోసం కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్న వార్తలు వున్నాయి. ఈ జాబితాలో టీ-డీపీ నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పరిటాల కుటు-ంబం ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ నార్త్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారాలని చూస్తున్నారు. అది కూడా సెమీ అర్బన్‌ లుక్‌ ఉన్న భీమిలి, పెందుర్తి, యలమంచిలిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే విజయం తేలిక అవుతుందన్న భావనలో ఉన్న ఆయన లెక్కలు వేసుకుంటు-న్నారు. అలాగే ఇదే సమయంలో గంటా కుమారుడు రవితేజ రాజకీయ ఆరంగేట్రం కోసం కసరత్తు జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా వున్న చోడవరం స్థానం నుంచి పోటీ- పెడితే ఎలా ఉంటు-ందనే చర్చ జరుగుతున్నట్లు- వార్తలు ఈ రెండు సీట్ల పోటీపై టీ-డీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటు-ందోనన్న ఆసక్తి కేడర్‌తో పాటు- రాజకీయ వర్గాల్లో సైతం వుంది. తండ్రీ, తనయులకు టిక్కెట్లు- దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ మరో ప్రధాన అంశం కూడా వుంది. టీ-డీపీ లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి పొంగురి నారాయణ, గంటా శ్రీనివాస రావు వియ్యంకులు కావటం, నారాయణకు రవితేజ అల్లుడు అవ్వడం తో ఈ కోటా వర్కవుట్‌ అవతుందన్న అభిప్రాయం కేడర్‌లో ఉంది.

- Advertisement -

ఇక అలాగే మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు తన కుమారుడు చింతకాయల విజయ్‌ను ఈ సారి అనకాపల్లి ఎంపీగా పోటీ- చేయించే యోచనలో వున్నారు. రాజకీయ వారసుడికి అవకాశం ఇవ్వాలని ఈసారి గట్టిగా పట్టు-బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో కీలకమైన ఐటీ- వింగ్‌ను పర్యవేక్షిస్తున్న చింతకాయల విజయ్‌ ఈసారి ఎన్నికలలో పోటీ-కి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం బలంగా వుంది. ఇప్పటికే ఆయనకు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికలలో విజయ్‌ పార్లమెంట్‌ బరిలో దిగాలని ప్రయత్నించారు. అయితే కొద్దిలో అవకాశం చేజారింది. అయినా అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తూ అధిష్టానం దృష్టిలో పడ్డారు.ఈ సమీకరణాలు అన్నీ విజయ్‌కు కలిసి వస్తాయన్న అభిప్రాయం కేడర్‌ తో పాటు- రాజకీయ వర్గాల్లో ఉంది. వినిపిస్తున్నాయి. ఇక పరిటాల కుటు-ంబం కూడా రెండు సీట్లు- ఆశిస్తున్న పరిస్థితి ఉంది. పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌ ఈ సారి ఎన్నికల్లో పోటీ-కి సిద్ధం అవుతున్నారు. రాప్తాడు, ధర్మవరం సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ధర్మవరం అభ్యర్థిగా శ్రీరామ్‌ దాదాపు ఖరారు అయ్యారు. ఇక రాప్తాడు అంశం తేలాల్సి వుంది. అయితే ఎన్నికల నాటికి సీట్ల కోసం పోటీ- పెరిగే అవకాశాలతో పాటు- పొత్తులు తెరపైకి వచ్చే పరిస్థితులు వున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకునే ప్రయత్నంలో సీనియర్‌ నేతలు బిజీగా ఉన్నారు. అయితే అధిష్టానం నిర్ణయం ఏమిటో ఇప్పటివరకు తేలలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement