అమరావతి, ఆంధ్రప్రభ :
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గాలపై ఆ పార్టీ అధి నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. ఈ నియో జకవర్గాల్లో మళ్లి పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ గడిచిన మూడు ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిం చిన అసెంబ్లిd నియోజకవర్గాలు రాష్ట్రంలో ఏడు స్థానాలు ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి రికార్డ్ సృష్టిం చింది. ఇప్పుడు కూడా ఆ విజయ పరంపరను కొన సాగించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్ఛాపురం, విశాఖపట్నం తూర్పు, మండపేట, రాజమండ్రి రూరల్, గన్న వరం, హిందూపురం, కుప్పంలలో వరుస విజయా లు సాధించింది. గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో గెలుపొందినా అధికారం మాత్రం చేజారిపోయింది. ఆ తర్వాత పరిణామాల్లో గన్నవరంలో టీడీపీ అభ్య ర్థిగా విజయం సాధించిన వల్ల భనేని వంశీ అధికార వైసీపీ గూటికి చేరారు. ఈసారి ఎన్నికల్లో ఆ స్థానాల ను మళ్లిd కైవసం చేసుకుని వంశీపై ప్రతీకారం తీర్చు కోవాలన్న కసితో తెదేపా అధినాయకత్వం ఉంది.
ఈనియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును ఇంఛార్జ్‌గా నియమించింది. అయితే కొద్దికాలం క్రితం ఆయన ఆకస్మికంగా అనా రోగ్యంతో మృతి చెందారు. బచ్చుల అర్జునుడిని ఇంఛార్జ్‌గా నియమించినప్పటికీ అక్కడ వంశీకి ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు టీడీపీ అధిష్టా నం అన్వేషణ చేస్తూ వచ్చింది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ కుటుంబం నుం చి నందమూరి వారసులను ఎవరో ఒకరినిబరిలోకి దింపాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. నందమూరి సుహాసినితో పాటు అదే కుటుంబానికి చెందిన మరికొందరు పేర్లు అధిష్టానం దృష్టికి వచ్చాయి. త్వరలోనే ఈ నియోజక వర్గానికి సంబంధించి ఒక నిర్ణయానికి ఆ పార్టీ అధి నేత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బచ్చుల అర్జునుడు కుమారుడికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడంతో ఆ కుటుంబానికి దాదాపు అక్కడ పోటీ చేసే అవకాశం లేనట్లుగా స్పష్టమవుతోంది.
ఇక ఇచ్ఛాపురంలో 2014, 2019 ఎన్నికల్లో బెందాళం అశోక్ వరుస విజ యాలు సాధిస్తూ వస్తున్నారు. 2009లో సాయిరాజ్ టీడీపీ అభ్యర్థిగా అక్కడ గెలు పొందారు. ఇప్పటికే బెందాళం అశోక్‌కు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విశాఖపట్నం తూర్పు నుంచి వెలగ పూడి రామ కృష్ణ బాబు వరుసగా మూడు ఎన్నికల్లో గెలు పొంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయనకు కూడా టికెట్ ఖరారైంది. ఇక తూర్పు గోదావరి జిల్లా మండ పేటలో జోగేశ్వర రావు మూడు వరుస విజయాలు సాధించి మళ్లి రేసు లో ఉన్నారు. రాజమండ్రి రూరల్ లో పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2014, 2019 ఎన్ని కల్లో విజయం సాధించారు. అంతకు ముందు 2009 లో చందన రమేష్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధిం చడంతో ఆ పార్టీ రాజమండ్రి రూరల్‌లో హ్యాట్రిక్ నమోదు చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం లో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ వరు సగా రెండు సార్లు విజయాలు సాధించారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.