అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ పునర్వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తూ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. దీనిలో భాగంగా ఇప్పుడు ఉత్తరాంధ్రపై తెలుగుదేశం పార్టీ కన్ను పడింది. గెలుపులో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్రలో మళ్లిd పాగా వేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పటిష్టమైన వ్యూహర చన చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు సాధించడంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో 25 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసి పట్టు నిలుపుకుంది. అయితే 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి తీరని నష్టం జరి గింది. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైకాపా ప్రభంజనం ఉత్తరాంధ్రపై కూడా చూపింది. ఈ ఎన్నికల్లో కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. అయితే శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా మరోసారి విజయం సాధించి జిల్లాలో తమ కుటుంబానికి ఉన్న ఆదరణను నిలబెట్టుకున్నారు.
ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న తెదేపా అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటితేనే అధికారం దక్కుతుందన్న భావనలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫోకస్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్రపై పెట్టారు. ఇదే సమ యంలో అధికార పార్టీ వరుస సమీక్షలు, ఇతర కార్య క్రమాలకు సిద్ధమవుతున్న తరుణంలో తెదేపా కూడా అదేబాటలో పయనించేందుకు సిద్ధమైంది. అధికార పార్టీకి ధీటుగా కార్యక్రమాల నిర్వాహణకు సన్నాహాలు చేసే పనిలో తెదేపా అధిష్టానం నిమగ్నమైంది. ఇదే స మయంలో ఉత్తరాంధ్రలో నేతల మధ్య ఉన్న విభే దాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నేతల పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వాహణ తదితర అంశాలపై రాబిన్ టీమ్ ఇప్పటికే పార్టీ చీఫ్ చంద్రబాబుకు నివే దికలు ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయ నగరం, శ్రీ కాకుళం జిల్లాలకు సంబంధించిన 34 అసెంబ్లిd నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ స్థానాల్లో మె రుగైన పరిస్థితిలో ఉన్నట్లుగా రాబిన్ టీమ్ అధిష్టా నానికి వెల్లడించింది. అయితే కొన్నికొన్ని నియో జకవర్గాల్లో ఉన్న వర్గ రాజకీయాలు ఈ విజయానికి కొంత ప్రతికూలతను చూపే పరిస్థితులు ఉన్నట్లుగా ఆ నివేదికల్లో స్పష్టం చేసింది. అంతేకా కుండా సంస్థా గతంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి తీసుకో వాల్సిన చర్యలను, ఇతర సూచనలను కూడా తెలియజేసింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న భారీ ప్రాంతీయ సదస్సును ఉత్తరాంధ్రలో నిర్వహించి ఎన్నికలకు నేతలను సిద్ధం చేయాలన్న నిర్ణయానికి తెదేపా అధిష్టానం వచ్చింది. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ప్రాంతీయ సదస్సు నిర్వాహణకు అవసరమైన చర్యలు చేపట్టారు. నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే చంద్ర బాబు పార్టీలో గ్రూపు విభేదాలపై సమీక్షించనున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సీనియర్లు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఎట్టి పరిస్థి తుల్లో అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈ 34 అసెంబ్లిd నియోజకవర్గాలు, 5 పార్ల మెంట్ స్థానాల్లో కనీసం రెండిట మూడు వంతులు పార్టీ ఖాతాలో జమ చేయాలన్న లక్ష్యంతో పటిష్టమైన వ్యూహాలను రచిస్తున్నారు.
ఇంకోవైపు సీనియర్ నేతలు తమ వారసులను ఈసారి బరిలోకి ఎలాగైనా దింపా లని ప్రయత్నాలు చేస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తు న్నారు. అయితే పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరా ంధ్రలో ప్రస్తుతం బీటలు పడటంతో నాయకుల ఒత్తడిపై కూడా టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. పనితీరు, సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ల కేటా యింపు ఉంటుందని ముఖ్యంగా కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని చంద్రబాబు సీనియర్లకు ఎప్పటి కప్పుడు తెల్చి చెబుతున్నారు. అయినప్పటికీ సీని యర్లు అధిష్టానంపై ఎంతో కొంత ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధి ష్టానం మాత్రం యువతకు ఈసారి అధిక అవకా శాలు కల్పించనున్నట్లుగా స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలవ్వడంతో టీడీపీ ఉత్తరాంధ్ర సదస్సు ద్వారా ఎన్నికల పోరును మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. భారీగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి కార్యకర్తలను ఈ సదస్సుకు తరలించి వారిని ఎన్నికలకు సిద్ధం చేయాలన్న లక్ష్యంతో తెదేపా పనిచేస్తోంది. ఈ సద స్సును విజయవంతం చేయడం ద్వారా పార్టీ పట్టును, సత్తాను చాటాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది.