Saturday, November 23, 2024

టీడీపీ మాక్ అసెంబ్లీ.. వినూత్నంగా నిరసన

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ.. ప్రజా సమస్యలపై చర్చకు గురువారం నుంచి రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. అనంతరం తీర్మానాలు చేసి స్పీకర్‌కు టీడీఎల్పీ పంపనుంది. ఒక రోజు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ.. వినూత్నంగా నిరసన తెలిపింది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు సమాంతర సభ నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం శాసనసభా పక్షం ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు. సమాంతర బీఏసీ సమావేశాన్ని నిర్వహించి.. రెండు రోజుల చర్చనీయాంశాలను ఖరారు చేసింది. సమాంతర అసెంబ్లీ సమావేశం గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వరకు జరిగింది. అలాగే శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది.

కాగా, ఏపీ శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తూతూమంత్రంగా ఒక్క రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతోనే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement