పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా కారణంగా వరుసగా మరణాలు సంభవిస్తోన్న విషయంపై ఏపీ అసెంబ్లీలో రగడ నెలకొంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాట్ల యుద్ధం కొనసాగుతోంది. వరుస మరణాలపై సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో శాసనసభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. టీడీపీ వైఖరిని వైసీపీ తప్పుపడుతోంది. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ ఐదు నిమిషాలు వాయిదా పడింది. అయితే, వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగా.. మళ్లీ అదే రగడ నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement