కర్నూలు జిల్లాను రాజధాని చేశావా జగన్!
జే టాక్స్, జె బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టావు…
రవ్వలకొండను మింగిన అనకొండ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి..
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చరిత్ర కలిగిన
కొండలను వదలని నాయకులు మీరు …
బొలెరో బ్యాచ్ బరతం పడతాం…
అజాతశత్రువు బీసీ జనార్దన్ రెడ్డి…
బీసీ జనార్దన్ రెడ్డిని, బైరెడ్డి శబరిని గెలిపించండి…
బనగానపల్లెను అభివృద్ధి చేసి చూపిస్తాం….
బనగానపల్లె ప్రజాగళం కు జనసునామీ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…
బనగానపల్లె (నంద్యాల జిల్లా) – అభివృద్ధి వికేంద్రీకరణ , మూడు రాజధానులు పేరిట మూడుముక్కలాటాడిన జగన్ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా చేశాడా అని, జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కేంద్రంగా పెట్రోల్ బంకు సర్కిల్ ప్రజా గళం భారీ బహిరంగసభ లో జగన్ పై నిప్పులు చేరిగారు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన మోసగాడు జగన్ అని,ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డను అని చిన్నాన్నను గొడ్డలి పోటుతో చంపేశారని తీవ్రంగా విమర్శించారు.అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఈ దుర్మార్గుడిదేనని, ఫ్యాన్ పీకేసి చెత్తకుండీలో పారేస్తేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
దోపిడి దారుడు, దొంగ జగన్ మోహన్ రెడ్డికి నా వయసు గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. టిడిపి అభివృద్ధి పనులు చేస్తే కూల్చి వేసే నైజం వైసిపిదని, టిడిపిది విజన్ ,వైసిపి ది పాయిజన్ అన్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె కు పట్టిన శని అని ,వచ్చే ఎన్నికల్లో శని ని వదిలించుకోవాలని ప్రజలకు సూచించారు.వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన, రవ్వల కొండను మింగేసిన అనకొండ కాటసాని రామిరెడ్డి అని విమర్శించారు. కాటసాని కనుసన్నల్లో నాటు సారా, కమిషన్ల దందా, బొలెరో బ్యాచ్, సెటిల్మెంట్ బ్యాచ్ లు విజృంభిస్తున్నాయని వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతామన్నారు.
అజాతశత్రువు అయిన బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించాలని 30 వేల మెజార్టీకి పైగా ఇక్కడ రావాలన్నారు. అభివృద్ధి మాంత్రికుడు నిత్యం నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడే బీసీని గెలిపించి సత్తా చాటాలని సూచించారు.
బనగానపల్లెకు ఔటర్ రింగ్ రోడ్డు, ఇంజనీరింగ్ కళాశాల, ఆటోనగర్ ఏర్పాటు , కోవెల కుంట్ల కు బైపాస్ రోడ్డు, కావాలని బీసీ జనార్దన్ రెడ్డి చంద్రబాబును అడగగా వీటన్నిటిని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా ప్రజలకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని, బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
మండుటెండలో జనసునామీ..
మధ్యాహ్న సమయంలోనూ మండుటెండల్లో వేలాది మంది ఇక్కడికి తగిలి రావడం వెనుక అధికార పార్టీపై ఎంత కసి మీలో ఉందో, టిడిపి పై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలిసిపోతుందని తెలిపారు. జగన్ సభలకు జనాలు లేరని, గ్రాఫిక్స్ లతో మాయ చేస్తున్నారని,ఈ మాయా లు మరో 40 రోజులు మాత్రమేనన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలని, సైకిల్ రావాలని, కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
గెలిచేది.. నిలిచేది మనమే.. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి..
నేడు జరగనున్న ఎన్నికల్లో గెలిచేది మనమేనని ప్రజల్లో నిలిచేది మనమేనని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రజా గళం సభకు వేలాదిగా ప్రజలు తరలి రావడం వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు. దోచుకోవడం దాచుకోవడం మినహా ఇక్కడ నాయకులు చేసింది ఏమీ లేదన్నారు. 2014 నుండి 2019 వరకు మేము చేసిన అభివృద్ధే బనగానపల్లె లో ఇప్పటికి కనబడుతుందన్నారు. ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో వైకాపా నాయకులు చెప్పుకునే పరిస్థితిలో లేరన్నారు. జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని నియోజకవర్గ ప్రజలకు నిజమైన అభివృద్ధి ఏమిటో చూపిస్తామని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.