Saturday, November 23, 2024

TDP Politics – 25 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్ ఛార్జ్ లు – క‌స‌ర‌త్తు చేస్తున్న చంద్ర‌బాబు

అమరావతి,ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజ యం సాధించాలనే సంకల్పంతో శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పు డు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా సంస్థా గత మార్పులపై దృష్టి సారించిన అధిష్టానం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రధానంగా ఎన్నికల్లో అత్యంత కీలకమైన నియో జకవర్గ ఇంఛార్జ్‌ల అంశంపై దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఖాళీగా ఉన్న నియో జకవర్గ ఇంఛార్జ్‌ల తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కొత్త ఇన్‌చార్జిలనుి నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. తాజాగా వరుసగా నియో జకవర్గ ఇంఛార్జ్‌లను నియమిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పు డు మరో కొత్త నిర్ణయం తీసుకోనున్నారు.

25 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. గత ఏడాది నుంచే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నేతల పనితీరును ఆయన పరిశీలిస్తూ వచ్చారు. అలాగే పార్టీ అంతర్గతంగా సర్వే నిర్వహించి ఆయా ప్రాంతాల్లో నేతల పనితీరుతో పాటు పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటు న్నారు. గతంలోనే కొంతమంది ఇంఛార్జ్‌ల పనితీ రుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఈ మేరకు వారి కి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పనితీరు మార్చు కోని నేతలకు ఉద్వాసన పలకాన్న కఠిన నిర్ణ యానికి చంద్రబాబు వచ్చారు. గతంలోని తప్పి దాలకు ఎటువంటి అవకాశం లేకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.

ప్రధానంగా అభ్యర్ధుల ఎంపికపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయా నికి పార్టీ అధిష్టానం వచ్చింది. కొత్తగా ఎంపిక చేసే నియోకవర్గ ఇంఛార్జ్‌లను దాదాపు అభ్యర్ధులుగా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులు పూర్తయిన, కాకున్నా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే దాదాపు 70 నుండి 80 మంది అభ్యర్ధులను అధిష్టానం ఎంపిక చేసింది. వీరిందరికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నియోజకవర్గాల్లో మకాం వేసి ఎన్నికల కార్యాచరణను ప్రారంభించారు. ఇంకోవైపు యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఇకపై నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఉండరని, ఇక నేరుగా అభ్యర్ధులే ఉంటారని స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గ ఇంఛార్జ్‌లే దాదాపుగా అభ్యర్ధులుగా ఎంపికవు తారన్న భావన నేతల్లో ఉంది. ప్ర ధానంగా రిజర్వ్‌డ్‌ స్థానాల్లో గతానికి భిన్నంగా అభ్యర్ధు లను ఎంపిక చేస్తున్నారు.
గిరిజన, హరిజన వర్గాలకు సంబంధించిన ఉన్నత ఉద్యోగులు, విద్యావంతులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త నియామకాలు జరుగుతున్నాయి

. ఎన్నికల నాటికి పూర్తిగా అభ్యర్ధుల ఎంపిక జరిగితే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న భావనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఈ మేరకే అభ్యర్ధులను ఎంపిక చేస్తూ వస్తోంది. రానున్న దసరా నాటికి ఈ కసరత్తును పూర్తి చేసి మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. రెబల్స్‌కు ఆస్కారం లేకుండా తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా నేతలకు ఇతర అవకాశాలు, పదవులపై స్పష్టమైన హామీని ఇస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement