ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: అధికారంలోకి వచ్చామని అహంకారం వద్దు, కక్ష సాధింపులు వద్దు. ప్రజలను తప్పు దోవ పట్టించే పనులు చేయవద్దు, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులకు హితవు పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిందని కదా.. అని అధికారంతో కక్ష సాధింపులకు పాల్పడొద్దని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయవద్దన్నారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దని, మంత్రులు , ఎమ్మెల్యేలు అహంకారానికి దూరంగా బాధ్యతతో, చిత్త శుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పని చేద్దామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని.. ముఖ్య నేతలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.